పబ్లిక్, కమ్యూనిటీ సంక్షేమ సంస్థలకు గుడ్ న్యూస్
- April 24, 2023
యూఏఈ: ప్రజా, కమ్యూనిటీ సంక్షేమానికి దోహదపడే సంస్థలను కార్పొరేట్ పన్ను నుండి మినహాయించినట్లు యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది ఈ సంవత్సరం అమలులోకి వస్తుందని తెలిపింది. ప్రజా సంక్షేమం, దాతృత్వం, కమ్యూనిటీ సర్వీసెస్ లేదా కార్పొరేట్, సామాజిక బాధ్యతపై దృష్టి సారించిన కంపెనీలు కార్పొరేట్ పన్ను నుండి మినహాయించబడతాయని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. యూఏఈ గత సంవత్సరం Dh375,000 అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్న కంపెనీలు, ఫ్రీలాన్సర్లపై తొమ్మిది శాతం కార్పొరేట్ పన్ను విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు యూఏఈ కార్పొరేట్ పన్ను ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, మినహాయింపుకు అర్హత పొందేందుకు, ఈ సంస్థలు తప్పనిసరిగా కార్పొరేట్ పన్ను చట్టంలోని ఆర్టికల్ (9)లోని షరతులను తప్పక పాటించాలని, అవి అన్ని సంబంధిత సమాఖ్య, స్థానిక చట్టాలకు అనుగుణంగా కొనసాగాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







