ఈద్ అల్-ఫితర్ సెలవులు: పోటెత్తిన పర్యాటకులు.. పెరిగిన హోటల్ ఆక్యుపెన్సీ రేట్లు!
- April 24, 2023
దోహా: ఈద్ అల్-ఫితర్ సెలవుల్లో పర్యాటకులు ఖతార్ కు పోటెత్తారు. దీంతో ప్రపంచ పర్యాటక హాట్‌స్పాట్‌గా ఖతార్ మారింది. జనవరి 2023 నుండి దేశానికి వచ్చే సందర్శకుల సంఖ్య భారీగా పెరిగిందని పర్యాటక రంగ నిపుణుడు అలీ సబ్రీ తెలిపారు. ఈద్ అల్-ఫితర్ సెలవుదినాల సందర్భంగా హోటళ్లలో పర్యాటకులు, నివాసితుల సంఖ్య పెరిగిందన్నారు. హోటల్ ఆక్యుపెన్సీ రేటును 80 శాతానికి పెంచిందని పేర్కొన్నారు. హయ్యా ప్లాట్‌ఫారమ్‌ను కొత్త రూపంలో పునర్నిర్మించడం పర్యాటక రంగానికి బలమైన ప్రేరణనిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ఖతార్‌కు పర్యాటకుల ప్రవాహాన్ని తాజా చర్యలు పెంచుతాయని తెలిపారు.
హయ్యా ప్లాట్‌ఫారమ్ 4 వీసా రకాలను అందిస్తుంది: ఏదైనా జాతీయత కలిగిన వారికి టూరిస్ట్ వీసా, అన్ని వృత్తుల కోసం GCC రెసిడెంట్ వీసా, అలాగే GCC పౌరుల ఎస్కార్ట్‌ల కోసం వీసా, eTA అని పిలువబడే ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ వీసా. ఇది పరిమితులు లేకుండా అమెరికా, కెనడా, స్కెంజెన్ దేశాలు, బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల వీసా హోల్డర్లకు అందుబాటులో ఉంది. ఖతార్‌ను సందర్శించాలనుకునే వారు, ఇప్పుడు ఒకే ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఖతార్ ఎయిర్‌వేస్ సహకారంతో ఖతార్ టూరిజం నిర్వహించిన ఈద్ ఇన్ ఖతార్ ప్రచారం కూడా పర్యాటకుల సంఖ్య పెరిగేందుకు ఒక కారణంగా ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. దోహాను అరబ్ మినిస్టీరియల్ కౌన్సిల్ ఫర్ టూరిజం 2023కి అరబ్ టూరిజం క్యాపిటల్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







