యూఏఈలో ప్రొఫెషనల్‌లు మెచ్చిన టాప్ 15 కంపెనీల జాబితా
- April 24, 2023
యూఏఈ: దుబాయ్ ఫ్లాగ్‌షిప్ క్యారియర్ ఎమిరేట్స్, కన్స్యూమర్ ప్రొడక్ట్స్ తయారీదారు ప్రోక్టర్ అండ్ గాంబుల్ (P&G) కంపెనీలు యూఏఈలోని ప్రొఫెషనల్‌లు తమ కెరీర్‌ను పెంచుకోవడానికి ఉత్తమ కంపెనీలుగా ఎంచుకున్నారు. యూఏఈలోని ప్రొఫెషనల్‌లు రేటింగ్ ఇచ్చిన మొత్తం 15 కంపెనీలలో ఎక్కువగా అంతర్జాతీయ బ్రాండ్‌లు ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రపంచంలోని అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్‌వర్క్ లింక్డ్‌ఇన్ వెల్లడించింది.
యూఏఈలోని టాప్ 15 కంపెనీలు:
ఎమిరేట్స్, ప్రోక్టర్ & గాంబుల్, కెర్నీ, మజిద్ అల్ ఫుట్టైమ్, వీసా, ష్నైడర్ ఎలక్ట్రిక్, మెకిన్సే & కో, బైటెడెన్స్, హెంకెల్, అడ్నోక్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, అమెజాన్, ఒరాకిల్, HSBC, జనరల్ ఎలక్ట్రిక్.
కెరీర్ పురోగతికి దారితీసే ఎనిమిది అంశాల ఆధారంగా కంపెనీలకు ర్యాంకులు కేటాయించారు. సామర్థ్యం; నైపుణ్యాల పెరుగుదల, సంస్థ స్థిరత్వం, బయటి అవకాశం, కంపెనీ అనుబంధం, జెండర్ వైవిధ్యం, దేశంలో విద్యా నేపథ్యం, ఉద్యోగుల ఉనికి తదితర అంశాల ఆధారంగా ఉత్తమ కంపెనీల జాబితాను తయారు చేశారు. 2022 డిసెంబర్ 31 నాటికి కనీసం 500 మంది ఉద్యోగులను కలిగి ఉన్న కంపెనీలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్లు లింక్డ్‌ఇన్ వెల్లడించింది. జాబితా నుంచి నియామక సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలను మినహాయించారు. ఇక లింక్డ్‌ఇన్, దాని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్, మైక్రోసాఫ్ట్ అనుబంధ సంస్థలను కూడా మినహాయించారు.
తాజా వార్తలు
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం







