ఏపీభవన్ విభజనపై సమావేశం వాయిదా..
- April 24, 2023
న్యూ ఢిల్లీ: ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ నిర్వహించ తలపెట్టిన సమావేశం మరోసారి వాయిదాపడింది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు(సోమవారం) సమావేశం జరగాల్సి ఉండగా.. బుధవారానికి వాయిదా వేసింది. కేంద్ర హోం శాఖ కార్యాలయం నార్త్ బ్లాక్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులు హాజరుకానున్నట్లు సమాచారం.
ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్ రావత్ , తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె రామకృష్ణ రావు హజరవుతున్నట్లు తెలుస్తోంది. విభజన చట్టం ప్రకారం ఢిల్లీలోని ఏపీ భవన్ 10 ఏళ్ళలో విభజన కావాల్సి ఉంది. ప్రస్తుతం 48శాతం తెలంగాణ, 52 శాతం ఏపీ వాటాగా ఆస్తులు పంచుకుని రెండు తెలుగు రాష్ట్రాలు ఢిల్లీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ఆస్తులు పంచుకోవాలని రెండు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







