పాలస్తీనాలో భారత మొదటి మహిళా ప్రతినిధిగా రేణు యాదవ్
- April 24, 2023
బహ్రెయిన్: గతంలో బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంలో సెకండ్ సెక్రటరీగా పనిచేసిన రేణు యాదవ్ పాలస్తీనా రాష్ట్రానికి కొత్త ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టిన మొదటి భారతీయ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. నిన్న జరిగిన సమావేశంలో పాలస్తీనా విదేశాంగ మంత్రి డాక్టర్ రియాద్ అల్-మల్కీకి రేణుయాదవ్ భారతదేశ ప్రతినిధిగా (డిసిగ్నేట్) తన ఆధారాలను సమర్పించారు. 2013లో ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో రేణు యాదవ్ చేరారు. కైరోలోని భారత రాయబార కార్యాలయంలో రేణుయాదవ్ తొలి నియామకాన్ని పొందారు. రాయబార కార్యాలయంలో విధులతో పాటు ఆమె అమెరికన్ యూనివర్సిటీ, కైరో నుండి అరబిక్ భాషలో అడ్వాన్స్డ్ డిప్లొమా చేశారు. ఆ తర్వాత బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంలో సెకండ్ సెక్రటరీ/ఫస్ట్ సెక్రటరీగా, పరిపాలన, మీడియా, విద్య మరియు రాజకీయ కార్యకలాపాలను నిర్వహించింది. రేణుయాదవ్ భారతదేశంలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా ఉన్నారు. మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, జిబౌటీలకు సంబంధించిన వ్యవహారాలను నిర్వహించారు. ఆమె నియామకం భారతదేశం - పాలస్తీనా మధ్య దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







