బహ్రెయిన్ లో ప్రపంచ ఇమ్యునైజేషన్ వీక్

- April 24, 2023 , by Maagulf
బహ్రెయిన్ లో ప్రపంచ ఇమ్యునైజేషన్ వీక్

బహ్రెయిన్: ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి వారంలో జరుపుకునే ప్రపంచ రోగనిరోధకత వారోత్సవాలు బహ్రెయిన్ లో ప్రారంభం అయ్యాయి. ఈ సంవత్సరం "ది బిగ్ క్యాచ్-అప్" థీమ్ కింద టీకాల ప్రాముఖ్యత,  అనేక వ్యాధులను నివారించడంలో.. సమాజాన్ని రక్షించడంలో వాటి పాత్రపై అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా శుభాకాంక్షలు తెలియజేశారు.  వ్యాక్సినేషన్ ద్వారా అంటువ్యాధులను ఎదుర్కోవడంలో.. మహమ్మారిని నియంత్రించడంలో బహ్రెయిన్ విజయాలను ప్రస్తావించారు. ప్రధానంగా కోవిడ్ -19 తో పోరాడడంలో స్పష్టంగా కనిపించిందని, తద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రశంసలను గెలుచుకున్నట్లు తన సందేశంలో కింగ్ హమద్ గుర్తుచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com