బంగ్లాదేశ్‌లో మెరుపుల భీభత్సం..9 మంది రైతు కార్మికులు మృతి
- April 24, 2023
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఆదివారం రెండు గంటల పాటు వర్షంతో పాటు మెరుపులు భీభత్సం సృష్టించాయి. దీంతో పొలాల్లో పనిచేస్తున్న తొమ్మిది మంది రైతు కార్మికులు మరణించారు. స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 10.00 గంటల నుండి 11.00 గంటల కురిసిన భారీ వర్షానికి సునమ్‌గంజ్, మౌల్విబజార్, సిల్హెట్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మరణాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా దక్షిణాసియాలో మే, జూన్‌ల మధ్య మెరుపులు, పిడుగులతో అత్యధిక మరణాలు నమోదవుతుంటాయి. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌లో కూడా ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా ఉంటోంది. వాతావరణ మార్పులే ఈ ప్రమాదాలకు కారణాలవుతున్నాయని నిపుణులు తేల్చారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్‌జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









