ఐపీఎల్ 2023: హైదరాబాద్ పై ఢిల్లీ విజయం...
- April 24, 2023
హైదరాబాద్: ఐపీఎల్ 2023లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ కేపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ఓటమి పాలైంది. ఢిల్లీ కేపిటల్స్ జట్టు 7 పరుగుల తేడాతో గెలుపొందింది. 145 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసింది. అత్యల్ప టార్గెట్ ను కూడా చేధించలేక హైదరాబాద్ జట్టు చతికిలపడింది.
హైదరాబాద్ జట్టులో మయాంక్ అగర్వాల్ ఒక్కడే రాణించాడు. 39 బంతుల్లో 49 పరుగులు చేశాడు. హెన్రిచ్ క్లాసెన్(19 బంతుల్లో 31 పరుగులు), వాషింగ్టన్ సుందర్(15 బంతుల్లో 24 పరుగులు) పోరాడినా.. జట్టుకి విజయాన్ని అందించలేకపోయారు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జే, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు. ఇశాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. మనీశ్ పాండే(27 బంతుల్లో 34 పరుగులు), అక్షర్ పటేల్(34 బంతుల్లో 34 పరుగులు) రాణించారు. డేవిడ్ వార్నర్(21), మిచెల్ మార్ష్(25) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. నటరాజన్ ఒక వికెట్ తీశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో భాగంగా 34వ మ్యాచ్ హైదరాబాద్, ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ , ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్… సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 145 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఈ సీజన్ లో ఉప్పల్ వేదికగా జరిగిన 4వ మ్యాచ్ ఇది. ఉప్పల్ లో ఆడిన 4 మ్యాచుల్లో కేవలం ఒక మ్యాచ్ లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. అలాగే, ఈ సీజన్ లో ఇప్పటివరకు హైదరాబాద్ 7 మ్యాచులు ఆడగా రెండింట్లో గెలుపొందింది. ఢిల్లీ 7 మ్యాచులు ఆడగా రెండింటిలో విజయం సాధించింది. పాయింట్ల టేబుల్ లో చివరి స్థానాల్లో (9, 10వ స్థానాల్లో) హైదరాబాద్, ఢిల్లీ ఉన్నాయి.
స్కోర్లు..
ఢిల్లీ కేపిటల్స్-20ఓవర్లలో 144/9
సన్ రైజర్స్ హైదరాబాద్-20ఓవర్లలో 137/6
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







