ఎయిర్ కేరళ పేరుతో కొత్త భారతీయ విమానయాన సంస్థ..!
- April 25, 2023
యూఏఈ: దుబాయ్‌కి చెందిన ఒక వ్యాపారవేత్త దక్షిణ-భారత రాష్ట్రమైన కేరళ నుండి ప్రవాసుల కోసం విమానయాన సంస్థను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. స్మార్ట్ ట్రావెల్స్ వ్యవస్థాపకుడు అఫీ అహ్మద్ మాట్లాడుతూ.. ఎయిర్ కేరళ ప్రాజెక్ట్‌ను నిజం చేసేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. గత నెలలో, వ్యాపారవేత్త మరొక స్థానిక కంపెనీకి airkerala.com డొమైన్ పేరు కోసం 1 మిలియన్ దిర్హామ్‌లను చెల్లించాడు. ఎయిర్ కేరళ అనేది కేరళ ప్రభుత్వం 2005లో ప్రకటించిన ప్రాజెక్ట్ అని, దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయులలో హాట్ టాపిక్‌గా ఉందని, దాంతో ఎలాంటి ఆలోచన చేయకుండా ఎయిర్ కేరళ డొమైన్ ను కొనుగోలు చేసినట్లు అఫీ అహ్మద్ వెల్లడించారు.
కేరళ ప్రభుత్వ ప్రతిపాదిత విమానయాన సంస్థ, ఎయిర్ కేరళ 2006లో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (CIAL)కి పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా నమోదు చేయబడింది. యూఏఈలో నివసిస్తున్న కేరళీయులకు ఆకాశాన్నంటుతున్న టిక్కెట్ ధరలు, విమానాల కొరత నుండి ఉపశమనం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎయిర్ కేరళ సంవత్సరాలుగా విస్తృతంగా చర్చలో ఉన్నా.. అనేక కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు.
ఎయిర్ కేరళ విమానయాన సంస్థను పునరుద్ధరించాలనే ఉద్దేశ్యాన్ని తాను ప్రకటించినప్పటి నుండి యుఎఇలోని మలయాళీ సంఘాల నుండి తనకు మద్దతు లభించిందని అఫీ చెప్పారు. "చాలా మంది వ్యాపారవేత్తలు నన్ను సంప్రదించారు. ప్రాజెక్ట్ అమలు చేయడానికి డబ్బును అందించడానికి ముందుకు వస్తున్నారు," అని అతను వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







