అంతర్ రాష్ట్ర ఫేక్ కరెన్సీ ముఠా గుట్టు రట్టు..
- April 25, 2023
హైదరాబాద్: అంతర్ రాష్ట్ర ఫేక్ కరెన్సీ ముఠా గుట్టు రట్టు అయింది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరుకి చెందిన 13 మందిని సైబరాబాద్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం ఫేక్ కరెన్సీ ముఠాలపై ఫోకస్ పెట్టామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అంతర్ రాష్ట్ర ఫేక్ కరెన్సీ ముఠాను పట్టుకున్నామని చెప్పారు.
13 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. కిరాణం షాప్స్, పాన్ షాప్స్ లో ఫేక్ కరెన్సీనీ మారుస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్, చెన్నై, కర్ణాటక కేంద్రంగా ఫేక్ కరెన్సీ రాకెట్ నడుస్తుందన్నారు. 1:3 రేసియోలో ఫేక్ కరెన్సీ ఇస్తున్నారని చెప్పారు.
ఒక లక్ష ఒరిజినల్ నోట్స్ కు రూ.3 లక్షల ఫేక్ కరెన్సీ ఇస్తున్నారని వెల్లడించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచి ఈ ముఠాను పట్టుకున్నామని పేర్కొన్నారు. రాజేష్, నిలేష్ అనే ప్రధాన నిందితులు సాయత్రం, రాత్రి వేళల్లో ఫేక్ నోట్స్ అమాయకుల దగ్గర సర్క్యులేట్ చేస్తున్నారని తెలిపారు.
నిందితుల నుంచి రూ.30 లక్షల 68వేల 500 ఫేక్ నోట్స్, క్యాష్ 60వేల 500వందల నగదు, 13 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఫేక్ నోట్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐదు రకాల తేడాలతో ఫేక్ నోట్స్ ను గుర్తించవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







