తెలంగాణ కొత్త సచివాలయంలో శాఖలకు సంబంధించిన ఫ్లోర్లు కేటాయింపు
- April 25, 2023
హైదరాబాద్: ఈ నెల 30వ తేదీన సమీకృత కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రేపటి (26వ తేదీ) నుంచి సమీకృత కొత్త సచివాలయానికి శాఖల షిఫ్టింగ్ షురూ కానుంది. ఈ నెల 28వ తేదీ వరకు అంటే మూడు రోజుల్లో మొత్తం శాఖలన్నీ షిఫ్ట్ అయిపోవాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు. ఇక ఒక్కో ఫ్లోర్ కు మూడు శాఖల చొప్పున కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో రెవెన్యూశాఖ, మొదటి ఫ్లోర్లో హోమ్ శాఖ, రెండో అంతస్తులో ఆర్థిక శాఖ ఉండబోతున్నాయి.
మూడో ఫ్లోర్లో అగ్రికల్చర్ & ఎస్సీ డెవలప్మెంట్ శాఖలకు కేటాయించారు. నాలుగవ అంతస్తులో ఇరిగేషన్ అండ్ లా, ఐదవ అంతస్తులో సాధారణ పరిపాలన శాఖ, ఆరో ఫ్లోర్ లో సీఎం, సీఎస్ లకు కేటాయింపులు చేశారు. ఈ మేరకు శాఖల వారిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే సచివాలయం ప్రారంభం రోజు ఉదయం కొత్త సచివాలయం ప్రాంగణంలో సుదర్శన యాగం చేయనున్నట్టు సమాచారం. దీనికిగాను అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







