నిద్రలేమికి కారణమైన ఈ హార్మోన్ గురించి మీకు తెలుసా.?
- April 26, 2023
హార్మోన్ల అసమతుల్యత కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు చూస్తుంటాం. ఊబకాయం రావడం, లేదంటే బాగా బక్క చిక్కి పోవడం. నిద్రలేమి, ఒత్తిడి, బాగా ఆకలి వేయడం, లేదా ఆకలి మందగించడం.. ఇలా ఒక్కటేమిటి అనేక రకాల సమస్యలు హార్మోన్ల అసమతుల్యత వల్లే తలెత్తుతుంది.
ముఖ్యంగా కార్టినాల్ అనే హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల అతిగా ఆకలి వేయడం, నిద్రలేమి తదితర సమస్యలు తలెత్తుతాయనీ తాజాగా ఓ సర్వే ద్వారా తెలిసింది.
ఈ హార్మోన్ శరీరానికీ, మనసుకీ అనుసంధాన కర్తగా పని చేస్తుందట. కార్టిసాల్ సమతుల్యంగా వున్నప్పుడు రోజంతా యాక్టివ్‌గా పని చేస్తారట. ఈ హార్మోన్ అసమతుల్యత వల్ల నిస్సత్తువ ఆవహిస్తుందట. తద్వారా అధికంగా ఆకలి వేసినట్లుంటుందట. నిద్రలేమితోనూ బాధపడతారట. అధికంగా ఒత్తిడి ఫీలవుతారట.
ఈ హర్మోన్ స్థాయిని సమతుల్యంగా వుంచాలంటే, శారీరక శ్రమ వుండాలనీ నిపుణులు చెబుతున్నారు. అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదనీ, రోజువారీ వ్యాయామం, కాసేపు మనసు లగ్నం చేసి యోగా చేస్తే సరిపోతుందట. సైక్లింగ్, జాగింగ్ ద్వారా ఈ హార్మోన్ బ్యాలెన్సెడ్‌గా వుంటుందని వైద్యులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







