సూడాన్ నుండి 58 దేశాలకు చెందిన 1687 మంది తరలిపు: సౌదీ

- April 26, 2023 , by Maagulf
సూడాన్ నుండి 58 దేశాలకు చెందిన 1687 మంది తరలిపు: సౌదీ

జెడ్డా: సౌదీ అరేబియా బుధవారం వరకు  సౌదీ పౌరులతో సహా 58 ఇతర దేశాల పౌరులను సుడాన్ నుంచి తరలించింది. మొత్తం 1687 మందిని సూడాన్ నుండి తరలించినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. 13 మంది సౌదీలతో సహా నిర్వాసితులైన వారు జెద్దా చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తరలించబడిన వారిలో యూఎస్, యూకే, ఫ్రాన్స్, సిరియా, నెదర్లాండ్స్, ఇరాక్, టర్కీ, టాంజానియా, జర్మనీ, స్వీడన్, లెబనాన్, ఒమన్, అల్జీరియా, ఈజిప్ట్, మొరాకో, ట్యునీషియా, థాయిలాండ్, భారతదేశం మరియు లిబియాలకు చెందిన ప్రజలు ఉన్నారు. వీరితోపాటు జోర్డాన్, పాలస్తీనా, మౌరిటానియా, యెమెన్, కెనడా, స్విట్జర్లాండ్, ఐర్లాండ్, ఆర్మేనియా, హంగేరి, ఇథియోపియా, సియెర్రా లియోన్, నైజీరియా, సెనెగల్, జిబౌటి, కేప్ వెర్డే, కాంగో, మడగాస్కర్, ఐవరీ కోస్ట్, సోమాలియా, దక్షిణాఫ్రికా, బోట్స్వానా, బోట్స్వానా, మలావి, క్రొయేషియా, నికరాగ్వా, లైబీరియా, దక్షిణ సూడాన్, కెన్యా, ఉగాండా, ఫిలిప్పీన్స్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా, జింబాబ్వే, పాకిస్తాన్, చాడ్, బంగ్లాదేశ్, నైజర్ మరియు శ్రీలంక దేశస్థులు కూడా ఉన్నారు.  ''సౌదీ అరేబియా రాజ్యం తన ప్రయత్నాలను కొనసాగిస్తుంది.విదేశీ పౌరులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా తరలించేలా సహాయం అందిస్తుంది'' అని మంత్రిత్వ శాఖ తెలిపింది. బుధవారం నాటి ఆపరేషన్‌తో రాజ్యం సుడాన్ నుండి తరలించబడిన మొత్తం వ్యక్తుల సంఖ్య 2148కి చేరుకుంది. ఇందులో 114 సౌదీలు, 62 దేశాలకు చెందిన 2034 మంది ఇతరులున్నారు. సుడాన్ సైన్యం,  ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య సుడాన్‌లో భారీ పోరాటం రెండవ వారంలోకి ప్రవేశించింది. ఏప్రిల్ 15 నుండి జరుగుతున్న అంతర్గత ఘర్షణల్లో 400 మందికి పైగా మరణించగా.. 3,500 మందికి పైగా గాయపడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com