‘రిపబ్లిక్’ సీక్వెల్‌కి ‘విరూపాక్ష’ ఊతమిచ్చిందా.?
- April 26, 2023
సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ‘రిపబ్లిక్’ పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొచ్చి ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయింది.
తేజు బైక్ యాక్సిడెంట్‌తో కోమాలో వున్న టైమ్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి తన వంతుగా ఈ సినిమాని ప్రమోట్ చేసినా సక్సెస్ కాలేదు.
నిజానికి ఇది సినిమా కాదు, వాస్తవ పరిస్థితి. పాలిటిక్స్ ముసుగులో జరుగుతున్న కుట్రలూ, కుతంత్రాలూ, మోసాలను ఎండగట్టేశాడు ఈ సినిమా ద్వారా డైరెక్టర్ దేవ్ కట్టా.
అయితే, ఈ సినిమాలోని వాస్తవ పరిస్థితుల్ని కాదు కదా.. కనీసం సినిమాలా కూడా ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. ‘విరూపాక్ష’ తో అల్టిమేట్ రీ ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. ప్రేక్షకులు కూడా అంతే బాగా తేజుకి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు సక్సెస్‌తో.
సో, ఈ టైమ్‌లో ‘రిపబ్లిక్’ సీక్వెల్ వదిలితే, మంచి బజ్ క్రియేట్ అవుతుందనుకుంటున్నాడట డైరెక్టర్ దేవ్ కట్టా. ఆ పనుల్లోనే ప్రస్తుతం ఆయన బిజీ అయిపోయారట. అన్నట్లు ‘రిపబ్లిక్’ సీక్వెల్ కోసం పవన్ కళ్యాణ్‌నీ దేవ్ కట్టా ఎంగేజ్ చేస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







