మరోసారి వాయిదా పడిన 'కబాలి' విడుదల
- May 09, 2016వరుస ఫ్లాప్ ల తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ డ్రామా కబాలీ. రజనీ ఏజ్ కు, ఇమేజ్ కు తగ్గ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ సినిమాను సమ్మర్ సీజన్ మొదట్లోనే రిలీజ్ చేయాలని భావించారు చిత్రయూనిట్. అయితే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవటంతో వాయిదా పడింది.ఆ తరువాత తమిళనాట ఎన్నికల హడావిడి మొదలు కావటంతో రజనీ మరోసారి వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే ఎన్నికలు పూర్తవ్వగానే ఎట్టి పరిస్థితుల్లో కబాలీ రిలీజ్ అవుతుందని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు మరోసారి షాక్ ఇచ్చాడు సూపర్ స్టార్. జూన్ 3న రిలీజ్ అవుతుందనుకున్న ఈ సినిమాను వాయిదా వేశారు. నెల ఆలస్యంగా జూలై 1న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
రజనీ నిర్ణయం అభిమానులకుకు నిరాశ కలిగించినా టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో నితిన్ కు మాత్రం ఆనందాన్ని కలిగిస్తోంది. వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'అ.. ఆ..' సినిమా జూన్ 3న రిలీజ్ అవుతోంది. అదే రోజు కబాలీ కూడా రిలీజ్ అవుతుందని టెన్షన్ పడుతోన్న చిత్రయూనిట్, రజనీ నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కబాలీలో రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తుండగా, రజనీ ముసలి డాన్ గా కనిపిస్తున్నాడు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం