దుబాయ్ రియల్ ఎస్టేట్: టాప్ పెట్టుబడిదారులుగా బ్రిటీష్, ఇండియా, రష్యా జాతీయులు
- April 27, 2023
యూఏఈ: బెటర్‌హోమ్స్ తాజా గణాంకాల ప్రకారం.. 2023 మొదటి త్రైమాసికంలో దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో బ్రిటీష్, భారతీయ, రష్యన్ జాతీయులు అగ్రశ్రేణి పెట్టుబడిదారులుగా ఉన్నారు. ఇతర జాతీయులలో ఇటలీ, లెబనాన్, ఈజిప్ట్, టర్కీ, ఫ్రాన్స్, చైనా పెట్టుబడిదారులు టాప్ 10 జాబితాలో ఉన్నారు. రష్యా-ఉక్రెయిన్ వివాదం తర్వాత యూరప్‌లో పెరుగుతున్న వ్యయాలు, మహమ్మారిని దుబాయ్ సమర్థవంతంగా నిర్వహించడం, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ వంటి అనేక కారణాల వల్ల ఇటీవల యూరప్, రష్యాకు చెందిన పెట్టుబడిదారులు దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో భారత ఉపఖండం పెట్టుబడిదారులను అధిగమించారు. విదేశీ యాజమాన్యం శాతం సడలింపు, 10 సంవత్సరాల గోల్డెన్ వీసాల జారీ కూడా విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని నివేదిక తెలిపింది.
దుబాయ్‌కి చెందిన సమనా డెవలపర్స్ తన తాజా ప్రాజెక్ట్‌లో యూరోపియన్లు టప్ పెట్టుబడిదారులుగా ఉన్నారని తెలిపింది. ఫ్రాన్స్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్, స్వీడన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, బెల్జియం, నార్వే దేశాలకు చెందిన యూరోపియన్లు దుబాయ్ ప్రాపర్టీలలో ప్రధానంగా పెట్టుబడులు పెడుతున్నారని సమనా డెవలపర్స్ జనరల్ మేనేజర్ నజ్మెహ్ జాఫారీ తెలిపారు. ప్రాపర్టీ కొనుగోలుదారులు ప్రధానంగా జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ నుండి వస్తున్నారని కోల్డ్‌వెల్ బ్యాంకర్ యూఏఈ వైస్ ప్రెసిడెంట్ అమాన్ యూసఫ్ చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్‌పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10







