మొక్కజొన్న రైతులకు కేసీఆర్ తీపి కబురు
- April 27, 2023
హైదరాబాద్: మొక్కజొన్న రైతులకు సీఎం కేసీఆర్ తీపి కబురు తెలిపారు. యాసంగి మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్..అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. అలాగే మొక్కజొన్న క్వింటాలకు ప్రభుత్వం మద్దతు ధర రూ. 1962 గా నిర్ణయించారు.
ప్రధానంగా మొక్కజొన్నను ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో సాగుచేశారు. అయితే ఇటీవల అకాల వర్షాలకు పలు జిల్లాలలో మొక్కజొన్న పంట కొంత దెబ్బతిన్న తరుణంలో ప్రభుత్వం కొనుగోలుకు నిర్ణయం తీసుకోవడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6.50 లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా 17.37 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని చెబుతున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మంత్రి నిరంజన్ రెడ్డి ఏర్పాట్లు చేయబోతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







