సౌదీలో కుండపోత వర్షం.. వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్
- April 28, 2023
రియాద్: రియాద్ ప్రాంతంలోని హురేమిలా గవర్నరేట్‌లో కుండపోత వర్షం కారణంగా తన వాహనంలో చిక్కుకుపోయిన వ్యక్తిని తమ రెస్క్యూ బృందాలు రక్షించాయని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ తెలిపింది. రెస్క్యూ ఆపరేషన్ తర్వాత భద్రతా సూచనలను పాటించడంలో విఫలమైనందుకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ (మురూర్) సహకారంతో వాహన యజమానికి వ్యతిరేకంగా సంబంధిత నిబంధనలు వర్తింపజేయబడ్డాయని, సివిల్ డిఫెన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. భారీ వర్షం సమయంలో వరదను దాటడానికి డ్రైవర్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఉల్లంఘనకు పాల్పడ్డాడని తెలిపింది. వర్షాల సమయంలో వరదనీటిలో మునిగిపోకుండా లేదా కొట్టుకుపోకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ప్రజలు వర్షం సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాలు, నీరు చేరే ప్రదేశాలు, లోయలకు దూరంగా ఉండాలని డైరెక్టరేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







