ఉగ్రవాద సంస్థ కు మరో గట్టి ఎదురుదెబ్బ
- May 09, 2016
ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన టాప్ లీడర్ ను అమెరికా మట్టుబెట్టింది. ఉగ్రవాదుల తాకిడి అధికంగా ఉండే అన్బార్ ప్రావిన్స్ చీఫ్ ఉన్న అబూ వాహిబ్ అనే ఉగ్రవాది, మరో ముగ్గురు అనుచరులు అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో హతమయ్యారు. ఈ విషయం పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ పీటర్ కుక్ తెలిపారు. అబు వాకర్ ఒకప్పుడు అల్ కాయిదా ఉగ్రవాద సంస్థలో సభ్యుడిగా ఉండేవాడు.అనంతరం ఇస్లామిక్ స్టేట్ లో చేరి పలు దాడులకు ఎన్నో ప్రణాళికలు రచించారు. దీంతో అతడినే లక్ష్యంగా చేసుకున్న అమెరికా వైమానిక బలగాలు అతడి జాడను గుర్తించి రూత్బా అనే ప్రాంతంపై దాడులు నిర్వహించగా అతడు ప్రాణాలుకోల్పోయాడు. నాయకత్వం లేకుండా చేస్తే ఆ ఉగ్రవాద సంస్థను పూర్తిగా నాశనం చేయొచ్చన్న తమ వ్యూహంలో భాగంగా అమెరికా వాయు సేనలతో కలిసి చేస్తున్న దాడులతో సాధించిన ఈ విజయం మరో గొప్ప అంశమని, మున్ముందు ఇలాంటివి మరిన్ని చేస్తామని ఇరాక్ సైనికాధికారి ఒకరు చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







