వరుణ్ తో రెజీనా..
- May 09, 2016
మంచి యాక్టింగ్ టాలెంట్ తో పాటు వరుసగా అవకాశాలు కూడా వస్తున్నా.. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోలేకపోతుంది రెజీనా. యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా.., స్టార్ హీరోల సరసన మాత్రం ఛాన్స్ సాధించలేకపోతుంది. అయితే మెగా హీరోలు మాత్రం ఈ అమ్మడికి బాగానే ఛాన్సులిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు మెగా హీరోలతో జతకట్టిన ఈ బ్యూటీ తాజాగా మరో మెగా హీరోతో నటించడానికి రెడీ అవుతోంది.పిల్లానువ్వులేనీ జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల్లో సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించింది రెజీనా. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించటంతో మెగా హీరోల దృష్టిలో పడింది. అదే సమయంలో మరో మెగా హీరో శిరీష్ సరసన కొత్తజంట సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మరో మెగా హీరోతో సినిమాకు రెడీ అవుతోంది.
ముకుంద, కంచె, లోఫర్ లాంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో 'మిస్టర్' సినిమాలో నటిస్తున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉంది. అయితే ముందుగా ఈ పాత్రకు హేబా పటేల్ ను తీసుకోవాలని భావించినా, వరుణ్ సరసన సూట్ అవ్వదన్న ఆలోచనతో రెజీనాను ఫైనల్ చేశారు. మరి వరుణ్ అయినా రెజీనాకు స్టార్ ఇమేజ్ తీసుకువస్తాడేమో చూడాలి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









