'బిచ్చగాడు-2' ట్రైలర్‌ విడుదల

- April 29, 2023 , by Maagulf
\'బిచ్చగాడు-2\' ట్రైలర్‌ విడుదల

2016లో వచ్చిన బిచ్చగాడు సినిమాతో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ మూవీతో తెలుగులోనూ తిరుగులేని మార్కెట్‌ క్రియేట్‌ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌ ప్రకటించినప్పుడు తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ మధ్య విడుదలైన పాటలు ఆ హైప్‌ను మరింత పెంచాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌ కనిపిస్తోంది. కంప్లీట్‌ కమర్షియల్‌ అండ్‌ ఎమోషనల్‌ ఎలిమెంట్స్‌తో ట్రైలర్‌ ఆద్యంత ఆసక్తికంగా కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా విజయ్ ఆంటోనీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫస్ట్‌ పార్ట్‌లో ఒక్కడే రెండు భిన్నమైన నేపథ్యాల్లో కనిపించాడు. ఈ సారి ఇద్దరులా కనిపిస్తూ ఆడియన్స్‌లో ఓ క్యూరియాసిటీని క్రియేట్‌ చేశారు. ఇంతకుముందు, సోషల్‌ మీడియాలో 'యాంటీ-బిక్లి' అనే కొత్త పదాన్ని ఉపయోగించి 4 నిమిషాల టీజర్‌, థీమ్‌ సాంగ్‌ను విడుదల చేస్తూ సినిమా థీమ్‌ను తెలియజేశాడు విజయ్. 'బిక్లి' అంటే పేదవారిని ఆర్థికంగా దోపిడీ చేసే అత్యాశపరుడు అని అర్థం. అయితే బిచ్చగాడు2లో విజయ్ ఆంటోని యాంటీ బికిలీగా కనిపించబోతున్నాడు. సీక్వెల్‌ ట్రైలర్‌ చూస్తోంటే విజయ్ ఆంటోనీ మరోసారి బ్లాక్‌ బస్టర్‌ కంటెంట్‌ తోనే వస్తున్నట్టు కనిపిస్తోంది. విజయ్ ఆంటోనీ సరసన కావ్యా థాపర్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మే 19న విడుదల చేయబోతున్నట్టు ట్రైలర్‌ లోనే అనౌన్స్‌ చేశారు. అంటే ఈ సమ్మర్‌లో బిచ్చగాడు-2తో ఆడియన్స్‌ మరో ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ చూడబోతున్నారని చెప్పొచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com