పోసాని ధారాసింగ్ గా...
- May 09, 2016
పోసాని కృష్ణమురళి, శ్రీహర్ష, శ్రావణి ప్రధాన పాత్ర ధారులుగా రాజేష్ పుప్పాల దర్శకత్వంలో లచ్చురామ్ ప్రొడక్షన్స్ పతాకంపై అంగోతు రాజునాయక్ నిర్మిస్తున్న సినిమా 'ధారాసింగ్'.ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, 'ట్రయాంగిల్ లవ్‌స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొంది స్తున్నాం. బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. దర్శకుడు రాజేష్ కథ చెప్పిన దానికంటే అద్భుతంగా తెరపై ఆవిష్కరిస్తున్నారు. మా బ్యానర్లో వస్తున్న రెండో చిత్రమిది.మొదటి చిత్రంగా 'దమ్మున్నోడు'ని తీశాం. అది మంచి హిట్ అయ్యింది. అలాగే ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. వైజాగ్, అరకు వంటి అందమైన ప్రాంతాలలో షూటింగ్ జరిపాం. ఈ చిత్రం ఆడియోను ఈ నెలాఖరులో విడుదల చేస్తున్నాం' అని అన్నారు.దర్శకుడు మాట్లాడుతూ, 'నిర్మాత సహకారం మరువలేనిది. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ చాలా కొత్తగా ఉంటూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది' అని చెప్పారు. ఈ చిత్రానికి బోలే సంగీతం అందిస్తూందగా, శ్రీశ్రీ, రాజు అనపర్తి లు పాటలు అందించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









