త్వరలో సౌదీ అరేబియా పర్యటనకు ఇరాన్ విదేశాంగ మంత్రి

- April 30, 2023 , by Maagulf
త్వరలో సౌదీ అరేబియా పర్యటనకు ఇరాన్  విదేశాంగ మంత్రి

బీరూట్: ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దోల్లాహియాన్ సౌదీ అరేబియాను సందర్శించనున్నారు. ఇటీవల సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ నుండి అధికారిక ఆహ్వానం అందుకున్న తర్వాత తాను అక్కడికి వెళ్లనున్నట్లు తాజాగా ఆయన ప్రకటించారు. లెబనాన్‌లోని బీరూట్‌లో విలేకరుల సమావేశంలో ఇరాన్ విదేశాంగ మంత్రి ఈ మేరకు స్పష్టం చేశారు.  తాను కూడా టెహ్రాన్‌ను సందర్శించాలని ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్‌కు అధికారిక ఆహ్వానాన్ని పంపినట్లు పేర్కొన్నాడు. ప్రిన్స్ ఫైసల్ కూడా ఆహ్వానాన్ని స్వాగతించారని పేర్కొన్నారు. రాయబార కార్యాలయాల విషయానికొస్తే.. సౌదీ అరేబియా, ఇరాన్‌లోని రెండు రాయబార కార్యాలయాలు రాబోయే కొద్ది రోజుల్లో తిరిగి తెరవబడతాయని ఆయన వెల్లడించారు. రియాద్ , ఇరాన్ మధ్య ఇటీవలి అభివృద్ధి ప్రాంతీయ స్థాయిలో సానుకూల వాతావరణం ఏర్పడిందని ఆయన ధృవీకరించారు. లెబనాన్‌లో తన 3 రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ విదేశాంగ మంత్రి పర్యటిస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com