యూఏఈ-భారత ఆర్థిక సంబంధాలలో కొత్త చైతన్యం
- April 30, 2023
యూఏఈ: గత ఏడాది మే 1 నుంచి అమల్లోకి వచ్చిన యూఏఈ -ఇండియా సెపా భాగస్వామ్యంలో కొత్త చైతన్యాన్ని నింపిందని యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ అన్నారు. ఈ ఒప్పందం కేవలం వాణిజ్యానికి సంబంధించినది కాదని, ఇది రెండు దేశాల మధ్య ఆర్థిక పురోగతికి చేయూతనిస్తుందన్నారు. ఇప్పుడు ఒప్పందం ప్రకారం వ్యాపారం, ప్రజల మధ్య సంబంధాలు పుంజుకుంటున్నందున పెట్టుబడులు, సేవలు, మానవ వనరులు, స్టార్టప్‌లపై దృష్టి మళ్లిందని ఆయన చెప్పారు. ఒప్పందం వల్ల భారతీయ ఎగుమతులు త్వరలో 31 బిలియన్ డాలర్లు దాటుతాయని అంచనా. రత్నాలు, ఆభరణాలు, శుద్ధి చేసిన ఖనిజాలు, ఆహారం, వ్యవసాయం, FMCG రంగం ఎగుమతుల వైపు నుండి అత్యధికంగా లాభపడిన రంగాలుగా ఉన్నాయని తెలిపారు.
యూఏఈ ఆహార భద్రతకు భారత్ అండగా ఉంటుందన్నారు. అదే సమయంలో ఆహార భద్రత విషయంలో యూఏఈ భారతదేశంలో $2 బిలియన్ల పెట్టుబడితో ఫుడ్ పార్కుల కోసం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. రెండు దేశాల మధ్య విమానయాన రంగంలో మరిన్ని అవకాశాలు ఉన్నాయి. యూఏఈలో పరిమిత సంఖ్యలో ఎయిర్ పోర్టులు ఉండగా.. భారత్ లో పరిస్థి భిన్నంగా ఉంది. రాబోయే రోజుల్లో యూఏఈ-భారత్ మార్గతంలో మరిన్ని సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







