కోర్టు స్నేక్‌గ్యాంగ్ నేరాలు నిర్ధారించింది...
- May 10, 2016
నగర శివారులో అకృత్యాలకు పాల్పడిన స్నేక్‌గ్యాంగ్‌లోని 8 మంది నేరానికి పాల్పడినట్లు రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం నిర్ధారించింది. నిందితులు దోపిడీ, అసభ్య ప్రవర్తనపై ఆధారాలు పరిశీలించిన న్యాయస్థానం నేరం చేసినట్లు నిర్థారించింది.అయితే వీరు అత్యాచారానికి పాల్పడ్డారనడానికి సరైన ఆధారాలు లేవని పేర్కొంది. ఈ కేసులో సరైన ఆధారాలు లేని కారణంగా తొమ్మిదో నిందితుడిపై కేసు కొట్టేసింది. దోషులకు రేపు శిక్ష ఖరారు కానుంది.పహాడీషరీఫ్ పోలీస్ ఠాణా పరిధిలో 2014, జులై 31న స్నేక్‌గ్యాంగ్ సభ్యులు ఫాంహౌజ్‌లోకి చొరబడి ఓ యువతిని పాముతో బెదిరించి అత్యాచారానికి పాల్పడటం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు నిందితులపై ఐపీసీ 376డి, 341, 323, 395, 506, 212, 411 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం తొమ్మిది మంది నిందితులపై కోర్టులో పోలీసులు అభియోగ పత్రం దాఖలు చేశారు. ఫైసల్ దయాని(ఎర్రకుంట), ఖాదర్ బరాక్బ(ఉస్మాన్‌సాగర్), తయ్యబ్ బసలమ(బండ్లగూడ, బార్కాస్), మహ్మద్ పర్వేజ్(షాయిన్‌నగర్), అలీ బరాక్బ(షాయిన్‌నగర్), సలాం హండీ(బిస్మిల్లాకాలనీ)లను నిందితులుగా చూపించారు. వీరిలో ఏడుగురు ప్రస్తుతం చర్లపల్లి కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉండగా... మిగిలిన ఇద్దరు బెయిల్‌పై బయట ఉన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







