మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ లో ప్రధాని మోడీ ప్రసంగం
- April 30, 2023
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఆదివారం మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్లో ప్రసంగించారు. ఈ కార్యక్రమం వల్ల ప్రజల్లోని భావోద్వేగాలు తెలసుకునే అవకాశం కలిగిందని ప్రధాని మోడీ అన్నారు. మన్‌కీ బాత్ మొదటిసారి 2014, అక్టోబర్ 3న ప్రారంభమైందని, 'మన్‌కీ బాత్' కోట్లాది మంది ప్రజల 'మన్ కీ బాత్' కి ప్రతిబింబమని అన్నారు. ఈ కార్యక్రమానికి భారీ విజయాన్ని అందించనందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రధాని మోడీ ప్రారంభ ప్రసంగంలో పేర్కొన్నారు. 'హర్ ఘర్ తిరంగా' వంటి అనేక ప్రజా ఉద్యమాలను ఊపందుకునేలా చేసిందని అన్నారు. ఆత్మ నిర్భర భారత్‌ను ప్రోత్సహించడంతో పాటు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలతో పాటు విభిన్న రంగాల్లో ప్రతిభావంతులైన వ్యక్తుల కథలను అందరికీ అందించిందని అన్నారు. ఇది ప్రజలతో కనెక్ట్ అయ్యేలా చేసిందని, ఇది ఓ కార్యక్రమం కాదని, ఆధ్యాత్మిక ప్రయాణమని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చర్చించామని, సమాజంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రసారమయ్యేలా బిజెపి పాలిత రాష్ట్రాలు భారీ ఏర్పాట్లు చేశాయి. పార్టీ కార్యాలయాలు, బూత్‌లలో ప్రధాని ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







