యూఏఈలో స్వల్పంగా పెరిగిన పెట్రోల్.. తగ్గిన డీజిల్ ధరలు
- April 30, 2023
యూఏఈ: యూఏఈ ఇంధన ధరల కమిటీ మే నెలకు సంబంధించి పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించింది. మే 1 నుండి సూపర్ 98 పెట్రోల్ ధర లీటరుకు దిర్హామ్ 3.16 అవుతుంది. ఏప్రిల్‌లో ఇది 3.01 దిర్హంగా ఉంది. అలాగే ప్రత్యేక 95 పెట్రోల్ ధర లీటరుకు Dh3.05 (ఏప్రిల్ Dh2.90) అవుతుంది. E-Plus 91 పెట్రోల్ ధర లీటరుకు 2.97 దిర్హాలు(ఏప్రిల్‌లో Dh2.82) అవుతుంది. డీజిల్ లీటరుకు 2.91 దిర్హామ్‌లుగా నిర్ణయించారు. ఇది గత నెలలో 3.03 దిర్హాంలుగా ఉన్నది.
ఈ సంవత్సరం చివరి నాటికి యూఏఈ వృద్ధి 3.9 శాతానికి చేరుకుంటుంది. యూఏఈలో ద్రవ్యోల్బణం కూడా ఈ సంవత్సరం చివరి నాటికి 3.2 శాతానికి తగ్గుతుందని అంచనా వేయబడింది. అంతకుముందు ఇది 4.8 శాతంగా అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా దిగుమతి చేసుకున్న ద్రవ్యోల్బణం తగ్గుదల ప్రభావాలు స్థానికంగా అద్దెలు, వేతనాలు దీనికి దోహదం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







