మస్కట్ లో 24 మంది నిర్వాసితులు అరెస్ట్
- April 30, 2023
మస్కట్: కార్మిక చట్టాలను ఉల్లంఘించి.. మస్కట్ గవర్నరేట్, సౌత్ అల్ షర్కియాలోని అనేక బహిరంగ ప్రదేశాల్లో అక్రమ విక్రయాలు చేస్తున్నందుకు 24 మంది కార్మికులను కార్మిక మంత్రిత్వ శాఖ అరెస్టు చేసింది. విలాయత్లో కార్మిక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు 13 మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నామని, నాన్-ఒమానీల విక్రయాలను అరికట్టేందుకు లేబర్ వెల్ఫేర్ జనరల్ డైరెక్టరేట్ తనిఖీ ప్రచారాన్ని నిర్వహించిందని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఖురయ్యత్, అల్ అమెరత్ విలాయత్లో 11 మంది ఇతర కార్మికులను ఇదే విషయంలో అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. అరెస్టయిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుకోనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









