ఉజ్జయిని, జైపూర్, పట్నా, గువాహటి, అలహాబాద్ రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై..
- May 10, 2016
గూగుల్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉచిత వైఫై సర్వీసులను మరో ఐదు రైల్వే స్టేషన్లకు విస్తరించింది. ఉజ్జయిని, జైపూర్, పట్నా, గువాహటి, అలహాబాద్ రైల్వే స్టేషన్లలో వైఫై సేవలను ప్రారంభించినట్లు గూగుల్ ప్రకటించింది. త్వరలోనే ఈ సేవలను కేంద్ర రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు లాంఛనప్రాయంగా ప్రారంభించనున్నట్లు పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం 15 రైల్వే స్టేషన్లలో గూగుల్ ఉచిత వైఫై సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి 100 రైల్వే స్టేషన్లలో ఈ సేవలను తీసుకొస్తామని గూగుల్ తెలిపింది.భారత రైల్వేకు చెందిన రైల్‌టెల్ నెట్వర్క్ భాగస్వామ్యంతో దేశంలోని 400 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సేవలను అందించేందుకు గూగుల్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది 100 రైల్వే స్టేషన్లలో వైఫై సేవలకు శ్రీకారం చుట్టింది. సెంట్రల్ ముంబయి, పుణె, భువనేశ్వర్, భోపాల్, రాంచీ, రాయ్‌పూర్, విజయవాడ, కాచీగూడ, ఎర్నాకులం జంక్షన్, విశాఖపట్నం ప్రాంతాల్లో ఇప్పటికే ఈ సేవలను ప్రారంభించింది. తాజాగా మరో ఐదు స్టేషన్లకు తమ సేవలను విస్తరించింది.ముంబయిలో ప్రారంభించిన ఈ సేవలకు మంచి ఆదరణ లభిస్తోందని.. త్వరలోనే ముంబయి శివారుల్లోని రైల్వేస్టేషన్లలోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ తెలిపింది.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







