దోహా-ఖతార్ లో వంశీ రామరాజుకి కళా సేవ జీవిత సాఫల్య పురస్కారం..
- April 30, 2023
దోహా: ఏప్రిల్ 27 2023 రోజున, దోహా ఖతార్ లోని తెలుగు కళా సమితి వారు, కళాబ్రహ్మ, శిరోమణి, డాక్టర్ వంశీ రామరాజు కి ఉగాది ఉత్సవాల సందర్భంగా, పోదార్ పెరల్ స్కూల్ ఆడిటోరియం దోహా-ఖతార్ లో సత్కరించారు.అలాగే ఏప్రిల్ 28 2023న, ఆల్కార్ కమ్యూనిటీ బాల్ రూమ్ లో ఉగాది వేడుకల సందర్భంగా కూడా డాక్టర్ వంశీ రామరాజు గారిని సత్కరించారు.
దోహా కతార్, తెలుగు కళా సమితి, అధ్యక్షులు తాతాజీ ఉసిరికల, డాక్టర్ వంశీ రామరాజు కి 'కళాసేవ జీవిత సాఫల్య' పురస్కారాన్ని సగర్వంగా ప్రకటించారు.
కర్రీ పద్మ, ప్రథమ కార్యదర్శి (పొలిటికల్ మరియు ఇన్ఫర్మేషన్) చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని, వంశీ రామరాజు కి బహూకరించారు.
దయా హాస్పిటల్స్, విశాఖపట్నం, సంచాలకులు ప్రవాసి స్త్రీ శక్తి (ఆటా, అమెరికా) గ్రహీత, డాక్టర్ రాజా రామ పద్మజ, కొత్త అధ్యక్షులు హరీష్ రెడ్డి దాసరపల్లి, అబ్దుల్ రెహమాన్, అధ్యక్షులు, ఇండియన్ స్పోర్ట్స్ కౌన్సిల్ (ISC-ఖతర్) దీపక్ శెట్టి, ఉపాధ్యక్షులు, ఐసిబిఎఫ్, ఖతార్,కె.ఎస్ ప్రసాద్,సత్యనారాయణ మలిరెడ్డి, టికేఎస్ ఫౌండర్ మెంబర్, ఐసీసీ కమిటీ మెంబర్, (ఇరువురు ప్రస్తుత నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు) వేదికను పంచుకున్నారు.. సేవా మూర్తి సీతాపతి అరికరేవుల కూడా పాల్గొన్నారు.
ప్రముఖ గాయని గాయకులు, యువకులు, ప్రాజ్ఞులు వారి మధురమైన గాత్రంతో చక్కటి సుస్వర సంగీత పాటలు పాడి ప్రేక్షకుల్ని అలరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)


తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







