అల్ ఖుసైస్‌లో కొత్త రహదారి ప్రాజెక్ట్.. తగ్గనున్న 60% ప్రయాణ సమయం..!
- May 01, 2023
దుబాయ్: అల్ ఖుసైస్‌లోని ఐదు ప్రాంతాలలో ప్రయాణ సమయాన్ని 60 శాతం వరకు తగ్గించే కొత్త రహదారి ప్రాజెక్ట్ ను ఆదివారం ప్రకటించారు. అల్ ఖుసైస్ ఇండస్ట్రియల్ ఏరియాలు 1, 2, 3, 4 మరియు 5లో అంతర్గత రోడ్లు, లైటింగ్ పనుల కోసం ఒక కాంట్రాక్టును దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో 10 కిలోమీటర్ల మేర 32 రోడ్లు 43 కిలోమీటర్ల వీధిలైట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇది రెండు దిశలలో గంటకు 500 నుండి 1,500 వాహనాల వరకు వెళ్లేలా.. రహదారిని 200 శాతం మేర విస్తరించనున్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలోని 60 వేల మందికి ఉపయోగపడుతుందని RTA డైరెక్టర్-జనరల్, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఛైర్మన్ మత్తర్ అల్ టేయర్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ను ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







