యూఏఈ ప్రెసిడెంట్ కప్ విజేతకు భారీ నగదు బహుమతి ప్రకటించిన షార్జా రూలర్
- May 01, 2023
యూఏఈ: యూఏఈ ప్రెసిడెంట్స్ కప్‌తో కిరీటాన్ని కైవసం చేసుకున్న షార్జా ఫుట్‌బాల్ క్లబ్ జట్టును ఆదివారం అల్ బాడీ ప్యాలెస్‌లో సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి అభినందించారు. ఈ సందర్భంగా Dh10 మిలియన్ల బహుమతిని అందించారు. షార్జా క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ పాలకుడు షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి, షార్జా డిప్యూటీ పాలకుడు షేక్ సుల్తాన్ బిన్ అహ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూఏఈ ప్రెసిడెంట్స్ కప్‌ను క్లబ్ చరిత్రలో పదోసారి, వరుసగా రెండోసారి షార్జా ఫుట్‌బాల్ క్లబ్ జట్టు గెలుచుకున్నది. టోర్నీని విజయవంతంగా నిర్వహించినందుకు యూఏఈ ఫుట్‌బాల్ అసోసియేషన్ (UAEFA) అధ్యక్షుడు షేక్ రషీద్ బిన్ హుమైద్ అల్ నుయిమిను అ సందర్భంగా వారు అభినందించారు. యూఏఈ ప్రెసిడెంట్ కప్‌ను గెలుచుకున్న షార్జా జట్టును, మేనేజ్మెంట్, కోచ్‌లను డాక్టర్ షేక్ సుల్తాన్ అభినందించారు. అబుధాబిలోని మొహమ్మద్ బిన్ జాయెద్ స్టేడియంలో గత శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో షార్జా ఫుట్‌బాల్ క్లబ్ జట్టు అల్ ఐన్ క్లబ్‌పై పెనాల్టీ షూటౌట్లో విజయం సాధించి యూఏఈ ప్రెసిడెంట్స్ కప్ టైటిల్‌ను సాధించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







