దుబాయ్‌లో 'IISA 2023' అవార్డ్స్.. 'GCI' ట్రైలర్ ఆవిష్కరణ
- May 01, 2023
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ (III) ఆధ్వర్యంలో హోటల్ తాజ్ బిజినెస్ బేలో జరిగిన ఒక గాలా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో "IISA '23" అవార్డ్స్, GCI (గ్లోబల్ కమ్యూనిటీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్) ట్రైలర్లను ఆవిష్కరించారు. III వ్యవస్థాపకుడు, సీఈఓ డా.షామా హుస్సేన్ మాట్లాడుతూ.. "IISA '23" అవార్డు ఈవెంట్‌ను జూలై 29న దుబాయ్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సంవత్సరం ‘IISA 23’ అవార్డ్స్ ను నేషన్ బిల్డింగ్ కార్నివాల్ థీమ్‌తో జరుపుకోనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం III గౌరవ డైరెక్టర్ల బోర్డు GCI (గ్లోబల్ కమ్యూనిటీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్) ట్రైలర్ వీడియోను డా.జితేంద్ర మట్లని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి H.E లైలా రహాల్, అబ్దులజీజ్, సందీప్ మెహతాతో పాటు లండన్ నుండి మోటివేషనల్ స్పీకర్ పరేష్ రుఘానీ హాజరై వ్యాఖ్యానించారు. జూలై 29న జరగబోయే అవార్డు కార్యక్రమంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 10 మంది ప్రఖ్యాత వ్యక్తులను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించనున్నట్లు III సహ వ్యవస్థాపకుడు సయ్యద్ సాజిద్, వెస్ట్‌ఫోర్డ్ ఎడ్యుకేషన్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బహ్రుల్లా సఫీ ప్రకటించారు. Marquisse Events మేనేజింగ్ LLC దుబాయ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







