విడాకులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
- May 01, 2023
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు విడాకుల అంశంపై కీలక తీర్పు వెలువరించింది. భార్యాభర్తలు అంగీకరిస్తే వెంటనే విడాకులు ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. పరస్పర అంగీకారం ఉంటే 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదని చెప్పింది. ఈమేరకు ఆరు నెలల నిరీక్షణ నిబంధనను సుప్రీంకోర్టు సడలించింది.
వివాహ బంధం మెరుగుపర్చుకోవడానికి అవకాశం లేని కేసుల్లో వెంటనే విడాకులు మంజూరు చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్ 142 ప్రకారం ప్రత్యేక అధికారాలను ఉపయోగించి సుప్రీం ఈ తీర్పు వెల్లడించడం గమనార్హం. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. ఈ బెంచ్‌లో జస్టిస్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, అభయ్ ఎస్. ఓకా, విక్రమ్ నాథ్, జేకే మహేశ్వరి సభ్యులుగా ఉన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!







