థాయ్‌లాండ్‌లో అరెస్ట్ అయిన చీకోటి ప్రవీణ్
- May 01, 2023
థాయ్‌లాండ్: క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ థాయ్‌లాండ్‌లో అరెస్ట్ అయ్యాడు. పటాయలో మొత్తం 93 మంది ఉన్న ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠాను అక్కడి థాయిలాండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో చీకోటి ప్రవీణ్ కూడా ఉన్నాడు. ఈ ముఠాలో 14 మంది మహిళలు ఉన్నారు. వీరి నుంచి భారీగా నగదు, గేమింగ్ చిప్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. థాయ్‌లాండ్ పటాయాలోని ఓ విలాసవంతమైన హోటల్‌పై మే1వ తేదీన తెల్లవారుజామున అక్కడి పోలీసులు దాడులు చేశారు. అక్కడ పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 93 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 80 మందికి పైగా భారతీయులే ఉండటం గమనార్హం. నిందితుల నుంచి రూ. 20 కోట్ల నగదు, 8 క్లోజ్డ్-సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలు, 92 మొబైల్స్, మూడు నోట్‌బుక్‌లను పోలీసులు సీజ్ చేశారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







