వలసదారులను అడ్డుకోవద్దు: పోప్‌ఫ్రాన్సిస్
- May 01, 2023
బుడాపెస్ట్: వలసదారులను అడ్డుకోవద్దని పోప్ ఫ్రాన్సిస్ హంగేరియన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం బుడాపెస్ట్‌లోని కొసుత్ లాజ్‌స్క్వేర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి సుమారు 50,000 మంది ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోప్ మాట్లాడుతూ.. హంగేరియన్లు జీసెస్‌ను అనుసరించాలనుకుంటే నిరుపేదలు, బాధల్లో ఉన్నవారిని ఆదుకోవాలని అన్నారు. వలసదారులు ఆతిథ్యదేశాల సంస్కృతిని సుసంపన్నం చేయగలరని అన్నారు. వలసదారులను అడ్డుకునేందుకు తలుపులు మూయడం బాధాకరమని, అది జీసెస్ బోధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. అలాగే యూరోప్‌లో పెరుగుతున్న జాతీయవాదం ప్రమాదాల గురించి కూడా హెచ్చరించారు. శనివారం పోప్ సెయింట్ ఎలిజిబెత్ చర్చిలో సుమారు 600 మంది శరణార్థులను కలుసుకున్నారు.
అయితే పోప్ సూచనలను హంగేరియన్ ప్రధాని విక్టర ఓర్బన్ వ్యతిరేకిస్తున్నారు. హంగేరీని వలసదేశంగా మార్చేందుకు తాను అనుమతించబోననని హెచ్చరించారు. వారు స్థానిక ప్రజల నైతిక గుర్తింపుకు అడ్డుపడుతున్నారని అన్నారు. వలసదారులను అడ్డుకునేందుకు 2015లో ఓర్బాన్ సెర్బియా సరిహద్దులో స్టీల్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. దేశ రాయబార కార్యాలయాల్లో ఆశ్రయం కోరుతూ సమర్పించే దరఖాస్తులను కూడా పరిమితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది కేవలం 18 మంది మాత్రమే శరణార్థుల హోదాను పొందారు. ఇతర దేశాలతో పోలిస్తే .. ఇది చాలా హాస్యాస్పదమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్
- కేరళంలో షిగెల్లా వ్యాధి..
- నంది అవార్డుల పునరుద్ధరణపై మంత్రి కీలక ప్రకటన
- ఈద్ డ్రా..విజేతల నంబర్లను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- హవల్లీ, ఫర్వానియాల్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- ప్రాంతీయ భద్రత పై బహ్రెయిన్-ఈజిప్ట్ చర్చలు..!!
- దక్షిణ అల్ బతినాలో ఇద్దరు మృతి..ఒకరు సేఫ్..!!
- iPhoneలను వెంటనే అప్డేట్ చేసుకోవాలన్న ఖతార్ NCSA..!!
- మిడిలీస్టులోనే అతిపెద్ద వాటర్ పార్క్ కిద్దియాలో సాఫ్ట్ లాంచ్..!!
- విమాన ఛార్జీలపై పరిమితులను ఉపసంహరించుకున్న భారత్..!!









