యూఏఈలో 20శాతం పెరగనున్న మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు..!

- May 01, 2023 , by Maagulf
యూఏఈలో 20శాతం పెరగనున్న మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు..!

యూఏఈ: యూఏఈలో బీమా కంపెనీల అందించే మెడికల్ ప్రీమియంలు పెరుగనున్నట్లు సమాచారం. మహమ్మారి తర్వాత ప్రతి సంవత్సరం ఆరోగ్య బీమా ప్రీమియంలు క్రమంగా 15 నుండి 20 శాతం పెరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. యూనిట్రస్ట్ ఇన్సూరెన్స్ బ్రోకర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొయిన్ ఉర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. బీమా కంపెనీలు ఇప్పుడు తమ పాలసీదారులకు కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నాయని, అలాగే ప్రీమియంల మొత్తాన్ని కూడా పెంచాయని తెలిపారు. అధిక ప్రీమియంలు పాలసీ తిరస్కరణకు దారి తీయొచ్చన్నారు. ఇన్సూరెన్స్‌మార్కెట్.ఏఈ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ హితేష్ మోత్వాని మాట్లాడుతూ.. ముఖ్యంగా మహమ్మారి సమయంలో అన్ని ఎలక్టివ్ సర్జరీలను ప్రభుత్వ సూచనల మేరకు నిలిపివేశారని, ప్రస్తుతం వాటిపై ఉన్న ఆంక్షలను సడలించడంతో బీమా కంపెనీలు కొంచెం అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. శస్త్రచికిత్సలు అవసరమయ్యే కేసులకు బీమా సంస్థలు అధిక ప్రీమియంను వసూలు చేస్తున్నాయని తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com