'టీఈ3ఎన్' ప్రమోషన్ కోసం సలహాలు : అమితాబ్ బచ్చన్
- May 10, 2016
సోషల్ మీడియాలో అభిమానులకు నిత్యం అందుబాటులో ఉంటూ, తన ఆలోచనలను పంచుకునే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సారి అభిమానుల నుంచి సలహాలను కోరాడు. అమితాబ్ తాజా సినిమా 'టీఈ3ఎన్' ప్రమోషన్ కోసం సలహాలు పంపాలని అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. 'సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో సలహాలు పంపండి. పోస్టర్ డిజైన్ నుంచి పబ్లిసిటీ వరకు ఎలా చేయాలో సలహాలు ఇవ్వండి' అంటూ బిగ్ బీ ట్విట్టర్ లో కోరాడు.రిభు దాస్ గుప్తా దర్శకత్వంలో సుజోయ్ ఘోష్ నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ థ్రిల్లర్ లో అమితాబ్ తో పాటు విద్యాబాలన్, నవాజుద్దీన్ సిద్దిఖీ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. అమితాబ్ తాత పాత్రలో నటిస్తుండగా, విద్యా బాలన్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







