కువైట్ పార్లమెంట్ రద్దు డిక్రీని ఆమోదించిన కువైట్ కేబినెట్
- May 02, 2023
కువైట్: కువైట్ కేబినెట్ సోమవారం కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రులు జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ డిక్రీని ఆమోదించారు. తుది ఆమోదం కోసం దానిని క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్‌కు రిఫర్ చేశారు. ప్రధానమంత్రి షేక్ అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబాహ్ అధ్యక్షతన బయాన్ ప్యాలెస్‌లో జరిగిన సెషన్ తర్వాత ఉప ప్రధానమంత్రి, కేబినెట్ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ ఖలీద్ అలీ మహ్మద్ అల్-ఫదేల్ ఓ ప్రకటనను విడుదల చేశారు. రాజ్యాంగ నిబంధన 107 ఆధారంగా జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలనే డిక్రీని మంత్రుల మండలి ఆమోదించిందని, తుది ఆమోదం కోసం దానిని హిస్ హైనెస్ ది క్రౌన్ ప్రిన్స్‌కు పంపినట్లు తెలిపారు.దీంతోపాటు కేబినెట్ అరబ్, అంతర్జాతీయ రంగాలలోని సమస్యలపై చర్చించారు. సూడాన్‌లోని పరిస్థితులపై చర్చించిన కేబినెట్.. బాధితులకు అవసరమైన సహాయం, వైద్య సహాయాన్ని పంపాలని నిర్ణయించారు. దీనిపై రక్షణ, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు విదేశాంగ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో ముందుకుపోవాలని సూచించారు. అలాగే రెడ్ క్రెసెంట్ సొసైటీ బాధితులకు అవసరమైన సహాయ సామాగ్రిని సుడాన్‌కు పంపడానికి చర్యలు చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







