దుబాయ్ లో 101 ఏళ్ల ప్రవాసుడు.. లాంగ్ లైఫ్ రహస్యం ఇదేనట..!
- May 02, 2023
దుబాయ్: టెహెమ్టెన్ హోమీ ధుంజిబాయ్ మెహతా దుబాయ్ లో ఉన్న 101 ఏళ్ల ప్రవాసుడు. ఈ జొరాస్ట్రియన్ దుబాయ్ నివాసి మే 9న 102 ఏళ్లు పూర్తి చేసుకుంటారు. సుదీర్ఘ నడక, అన్ని రకాల దుర్గుణాలు, మితిమీరిన వాటికి దూరంగా ఉండటమే తన దీర్ఘాయువు రహస్యమని తెలిపారు. దుబాయ్ మెరీనాలోని అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తున్న మెహతా.. తన ఇంటి పనులన్నీ తానే చేసుకుంటాడు. 2018లో కాలు విరిగడంతో మంచానికే పరిమితమైన అతను.. అనంతరం కాలంలో పట్టుదల, సంకల్పంతో తిరిగి మామూలు మనిషిగా మారాడు. అతని వయస్సు 100 పైబడినా మెహతా ఇప్పటికీ చురుకుగా, ఏదో పనిలో నిమగ్నమై ఉన్నాడు. తన UAE డ్రైవింగ్ లైసెన్స్‌ను అక్టోబర్ 2023 వరకు పునరుద్ధరించుకున్నాడు. కానీ అతను 2004 నుండి డ్రైవింగ్ చేయలేదు. ప్రజా రవాణాను ఉపయోగించడాన్ని ఇష్టపడతానని, దుబాయ్ మెట్రో చౌకగా.. సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. గతంలో తాను వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుండి జుమేరా క్రీక్ వరకు నడిచేవాడిని, కానీ ఇప్పుడు చిన్నదూరాలకు మాత్రమే నడక ద్వారా వెళ్తున్నట్లు పేర్కొన్నారు.
1922లో కెన్యాలో బ్రిటీష్ పాలనలో ఉన్నప్పుడు జన్మించిన మెహతా.. 1980లో దుబాయ్ వచ్చారు. దీరాలోని ఫైవ్ స్టార్ హోటల్లో అకౌంటెంట్‌గా పనిచేస్తూ.. 2002లో రిటైర్ అయ్యారు. భారతీయ సంతతికి చెందిన ఈ గ్రాండ్ ఓల్డ్ మాన్.. తొందరగా పడుకోవడం, త్వరగా లేవడం, మనిషిని ఆరోగ్యవంతంగా, ధనవంతుడిగా, జ్ఞానవంతుడిగా మారుస్తుందని చెబుతున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు తన రోజును ప్రారంభించటానికి ఇష్టపడే మెహతా.. కప్పు టీ తో తన రోజును ప్రారంభిస్తారు. సాయంత్రాలను చదవడం లేదా టీవీ చూడటంలో గడుపుతాడు. సమీపంలోని రెస్టారెంట్లో లేదా సూపర్మార్కెట్లో దొరికే తేలికపాటి భోజనాన్ని ఎంచుకుంటానని పేర్కొన్నారు.
ఇక మెహతా పెళ్లి చేసుకోలేదు. అతనికి యునైటెడ్ కింగ్డమ్ (UK)లో ఒక చెల్లెలు ఉంది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం యూకే వెళ్లిన సమయంలో లండన్‌లో పట్టపగలు తనన కొందరు దుండగులు దోచుకున్నారని, అందుకే అక్కడే ఉండాలన్న ప్రణాళికలు మార్చుకున్నట్లు మెహతా చెప్పారు. తాను దుబాయ్‌ని సురక్షితంగా భావిస్తానని, అందుకే ఇక్కడే శేషజీవితాన్ని గడిపేందుకు నిర్ణయించుకున్నట్లు మెహతా తెలిపారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







