దుబాయ్ లో ముగిసిన గ్లోబల్ విలేజ్.. మళ్లీ ఎప్పుడంటే?
- May 02, 2023
దుబాయ్: దుబాయ్ సంస్కృతుల వార్షిక వేడుక గ్లోబల్ విలేజ్ మే 1న తెల్లవారుజామున 2 గంటలకు ముగిసింది. మల్టీ కల్చరల్ పార్క్ సీజన్ 27 చివరి రోజైన ఆదివారం వేలాది మంది సందర్శకులు తరలివచ్చారు. "మేము సీజన్ 27కు వీడ్కోలు పలుకుతున్నాం. ఇది కొంతకాలం మాత్రమే. త్వరలోనే సీజన్ 28లో మీకు మరిన్ని ప్రత్యేకతలను తీసుకువస్తామని హామీ ఇస్తున్నాము" అని గ్లోబల్ విలేజ్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. తిరిగి అక్టోబర్ 2023లో సీజన్ 28 ప్రారంభం అవుతుందని గ్లోబల్ విలేజ్ ప్రకటించింది. ఒక సీజన్ సాధారణంగా ఆరు నెలల పాటు ఉంటుంది. సీజన్ 27లో పార్క్ 90 కంటే ఎక్కువ సంస్కృతులను సూచించే 27 పెవిలియన్లను ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 250కి పైగా ఫుడ్ అవుట్లెట్లు రుచులను అందించాయి. కార్నవాల్లో 175 రైడ్లు, స్కిల్ గేమ్‌లు, ఆర్కేడ్ గేమ్‌లు, వినోద ఆకర్షణలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







