బహ్రెయిన్ స్కూల్స్‌పై తీవ్రవాదుల దాడి
- May 10, 2016
గత కొద్ది రోజులుగా బహ్రెయిన్‌లోని పలు స్కూళ్ళపై తీవ్రవాదులు దాడులు చేసినట్లు ఎడ్యుకేషనల్ అథారిటీ వర్గాలు వెల్లడించాయి. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ జారీ చేసిన ప్రకటనలో దేశంలోని పలు ప్రాంతాల్లో నాలుగు స్కూళ్ళపై తీవ్రవాదులు దాడులు చేశారని పేర్కొంది. టుబ్లి ఎలిమెంటరీ బాయ్ స్కూల్‌కి వెళ్ళే రోడ్డుని టైర్లు, కాంక్రీట్ స్లాబ్స్‌తో మూసివేశారనీ, అల్ ఫరాబి ఇంటర్మీడియట్ స్కూల్ గేట్ వద్ద వేస్ట్ బిన్ని తగలబెట్టారనీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వెల్లడించింది. బురి ఎలిమెంటరీ బాయ్ స్కూల్లోకి చొరబడ్డ తీవ్రవాదులు, స్టీల్ బ్యారియర్‌ని దొంగిలించగా, ఎతుమాన్ బిన్ అఫ్ఫాన్ ఎలిమెంటరీ అండ్ ఇంటర్మీడియట్ బాయ్స్ స్కూల్‌పై రాళ్ళతో దాడి చేశారనీ, ఈ ఘటనలో భవనం ధ్వంసమయ్యిందని మినిస్ట్రీ వివరించింది. గడచిన ఐదేళ్ళలో విద్యా సంస్థలపై 498 దాడులు జరిగాయని మినిస్ట్రీ పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డైరెక్టరేట్ వెల్లడించింది
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







