నేడు ఢిల్లీకి వెళ్లనున్న సిఎం కెసిఆర్

- May 03, 2023 , by Maagulf
నేడు ఢిల్లీకి వెళ్లనున్న సిఎం కెసిఆర్

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీలో నిర్మించిన బిఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని మే 4న సిఎం కెసిఆర్‌ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. బిఆర్‌ఎస్‌గా మారిన తర్వాత పార్టీ కార్యకలాపాలకు జాతీయస్థాయిలో కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని నిర్మించారు. జాతీయస్థాయి పార్టీ కార్యకలాపాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచి నడువనున్నాయి. వివిధ పార్టీలను ఒకే వేదిక మీదికి తీసుకురావడం, సదస్సులు, సమావేశాలకు పార్టీ కార్యాలయం ఒక వేదికగా పనిచేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ స్థాయి బిఆర్ఎస్ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com