నటుడు, దర్శకుడు మనోబాల కన్నుమూత

- May 03, 2023 , by Maagulf
నటుడు, దర్శకుడు మనోబాల కన్నుమూత

చెన్నై: దక్షిణాది ప్రముఖ నటుడు, దర్శకుడు మనోబాల ఇకలేరు. కొంతకాల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 69 సంవత్సరాల మనోబాల గత రెండు వారాలుగా కాలేయ సంబంధిత సమస్యల కారణంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఈ వార్త తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో అందరినీ షాక్‌కు గురి చేసింది. అతని అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన తెలుగులో చివరగా మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాలో జడ్జి పాత్రలో కనిపించారు. శివకార్తికేయన్ హీరోగా తెలుగు, తమిళ్ లో విడుదలైన డాన్ చిత్రంలో స్కూల్ టీచర్ గా అందరినీ నవ్వించారు. మనోబాలకు భార్య ఉష మహదేవన్, కుమారుడు హరీశ్ ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com