'డిజిటల్ బహ్రెయిన్ దినార్'పై వ్యతిరేకత..!
- May 04, 2023
బహ్రెయిన్ : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ (CBB) త్వరలో డిజిటల్ దినార్ ట్రయల్‌ను ప్రారంభించాలని యోచిస్తుండగా, చాలా మంది వ్యక్తులు సోషల్ మీడియాలో దాని పట్ల తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. 2018 నుండి దీనిపై బ్యాంకు పనిచేస్తోందని, ఈ చర్య బ్యాంక్ రికవరీ ప్రణాళికలో భాగమని CBB బ్యాంకింగ్ కార్యకలాపాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెస్సా అల్సాడా వెల్లడించారు. డిజిటల్ దినార్ అనేది లావాదేవీల కోసం ఉపయోగించే డిజిటల్ కరెన్సీ. ఇది బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల మాదిరిగానే ఉంటుంది. అయితే దీనికి CBB గుర్తింపు ఉంటుంది. డిజిటల్ దినార్ CBB ద్వారా జారీ చేయబడుతుంది.. నిర్వహించబడుతుంది. ఇది కిరాణా కొనుగోలు లేదా బిల్లులు చెల్లించడం వంటి రోజువారీ లావాదేవీలకు ఉపయోగించవచ్చు. కాగా, చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు డిజిటల్ కరెన్సీపై వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.ఇది సమాజంపై చూపే ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







