15 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు

- May 04, 2023 , by Maagulf
15 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు

యూఏఈ: అబుధాబిలో ఉండే భారతీయ ప్రవాసుడు ప్రదీప్ కుమార్.. బిగ్ టికెట్ ర్యాఫిల్ డ్రా సిరీస్ 251లో 15 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్నాడు. ఏప్రిల్ 13న విజేతగా నిలిపిన టిక్కెట్ నంబర్ 048514ను కొనుగోలు చేశాడు. బహుమతి సమాచారం దక్షిణ భారత నగరమైన చెన్నైలోని విమానాశ్రయంలో ఉన్న సమయంలో నిర్వాహకులు తెలపడంతో ప్రదీప్ సంతోషం వ్యక్తం చేశాడు.  త్వరలోనే అబుధాబి వస్తున్నానని, ప్రైజ్ మనీని మరో ఇద్దరు స్నేహితులతో పంచుకోనున్నట్లు కుమార్ తెలిపారు. ప్రత్యేకంగా, బిగ్ టికెట్ ఈ నెలలో 100 మంది అదృష్ట విజేతలకు 100 బహుమతులు అందజేస్తోంది. జూన్ 3న జరగనున్న ర్యాఫిల్ డ్రా సిరీస్ 252కి 20 మిలియన్ దిర్హాంల భారీ బహుమతి లభిస్తుంది. మే 31 వరకు బిగ్ టికెట్ వెబ్‌సైట్ http://www.bigticket.ae ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు లేదా అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం, అల్ ఐన్ విమానాశ్రయంలోని స్టోర్ కౌంటర్‌లను సందర్శించడం ద్వారా టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com