మావోయిస్టు కదలికల పై నిరంతరం అప్రమత్తత అవసరం: డీజీపీ అంజనీ కుమార్‌

- May 04, 2023 , by Maagulf
మావోయిస్టు కదలికల పై నిరంతరం అప్రమత్తత అవసరం: డీజీపీ అంజనీ కుమార్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా అది తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఈపరిస్థితుల్లో పోలీస్‌ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల పోలీస్‌ అధికారులతో డీజీపీ గురువారం తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ ప్రముఖులు, వీవీఐపీల పర్యటన సమయంలో భద్రతా బలగాలు సంచరించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో రాష్ట్రాల సరిహద్దుల ప్రాంతాల్లో మావోయిస్టుల యాక్షన్‌ టీంల కదలికలు పెరిగే అవకాశం ఉందన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
పోలీస్‌ శాఖ నిరంతర కృషే వల్ల తెలంగాణలో వామపక్షతీవ్రవాదం పూర్తిగా అంతరించిపోయిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో 96 ల్యాండ్‌మైన్‌ అమర్చిన, పేలుడు ఘటనలు వెలుగుచూశాయని చెప్పారు. మావోయిస్టు చర్యలకు సంబంధించిన కీలక దాడుల్ని ఈ సందర్భంగా డీజీపీ అధికారులకు వివరించారు. ఈ వర్క్‌షాప్‌లో అడిషనల్‌ డీజీ గ్రేహౌండ్స్‌ విజరు కుమార్‌, అడిషనల్‌ డీజీ సంజరు కుమార్‌ జైన్‌, ఐజీ ఎస్‌ఐబీ ప్రభాకర్‌ రావు, ఐజీలు చంద్రశేఖర్‌ రెడ్డి, షానవాజ్‌ ఖాసీం ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com