ప్రవాస కార్మికుల రిక్రూట్: కొత్త దేశాల వారికి కువైట్ ప్రాధాన్యం

- May 05, 2023 , by Maagulf
ప్రవాస కార్మికుల రిక్రూట్: కొత్త దేశాల వారికి కువైట్ ప్రాధాన్యం

కువైట్: ఇప్పటికే కువైట్ లో అధిక జనాభా ఉన్నవారు కాకుండా కొత్త దేశాల నుండి ప్రవాస కార్మికులను రిక్రూట్ చేసుకునే అవకాశాలను అన్వేషించడానికి చర్యలు తీసుకోవాలని మొదటి ఉప ప్రధాన మంత్రి , అంతర్గత మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ అల్-సబాహ్ ఆదేశించారు. జనాభా అసమతుల్యత సమస్యను ప్రభావితం చేయకుండా దేశంలోని కార్మికుల కొరతను పరిష్కరించడం ఈ చర్య ప్రధానం ఉద్దేశమన్నారు. అధికారులు ఇంతకు ముందు విడుదల చేసిన డేటా ప్రకారం.. మొత్తం 965,774 జనాభాతో దేశంలో అత్యధిక జనాభా ఉన్న కమ్యూనిటీలలో భారతీయులు మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఈజిప్షియన్లు 655,234 మంది,  ఫిలిప్పీన్స్ (274,777), బంగ్లాదేశ్ (256,849), సిరియా (162310) ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com