కాంగోలో వరద బీభత్సం.. 176 మంది మృతి
- May 07, 2023
కాంగో: ఆఫ్రికాలోని కాంగోలో వరద బీభత్సం సృష్టించింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలకు దక్షిణ కివు ప్రావిన్స్ లో నదులకు వరద నీరు పోటెత్తింది. దీంతో ఊర్లకు ఊర్లే వరద నీటిలో కొట్టుకుపోయాయి. వరదల ధాటికి 176 మంది మరణించారు.
మరో 200 మందికి పైగా వరదల్లో గల్లంతయ్యారు. కాగా, ఇళ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు వరద నీటిలో కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. ఉండటానికి ఇళ్లు లేక ప్రజలు నిరాశ్రయులయ్యారని వెల్లడించారు. నిలువ నీడలేకపోవడంతో ఆరుబయటే ఉంటున్నారని తెలిపారు.
దక్షిణ కివులో వరదలు, కొండచరియలు విరిగి పడటం సర్వ సాధారణమని అధికారులు పేర్కొన్నారు.
2014లో కూడా ఇలాంటి ప్రకృతి విపత్తే సంభవించిందని గుర్తు చేశారు. భారీ వర్షాలకు ఏడు వందలకు పైగా ఇళ్లు తుడిచిపెట్టుకు పోయాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది.
130 మందికి పైగా గల్లంతయ్యారని ఐరాస పేర్కొంది. గత నెల ఏప్రిల్ లో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 21 మంది మరణించారు. కిన్ షాసాలో డిసెంబర్ కురిసిన భారీ వర్షాలతో 169 మంది చెందారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







