చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..

- May 07, 2023 , by Maagulf
చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..

న్యూ ఢిల్లీ: ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి చ‌రిత్ర సృష్టించాడు. శ‌నివారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ తో జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లి 46 బంతుల్లో 55 ప‌రుగులు చేశాడు. వ్య‌క్తిగ‌త స్కోరు 12 ప‌రుగుల వ‌ద్ద ఐపీఎల్‌(IPL)లో ఏడువేల ప‌రుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెట‌ర్‌గా అవ‌త‌రించాడు. ఈ ఘ‌న‌త‌ను అత‌డు త‌న సొంత మైదానంలో అందుకోవ‌డం విశేషం. విరాట్ 233 మ్యాచుల్లో ఈ ఘ‌న‌త‌ను సాధించాడు. ఐదు శ‌త‌కాలు, 49 అర్ధ‌శ‌త‌కాలు కోహ్లి ఖాతాలో ఉన్నాయి.

ఇప్ప‌టికే ఐపీఎల్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా విరాట్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అత‌డి త‌రువాత శిఖ‌ర్ ధావ‌న్‌(6536), డేవిడ్ వార్న‌ర్(6189), రోహిత్ శ‌ర్మ‌(6063) లు వ‌రుస‌గా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com